క్వారంటైన్ కేంద్రాల్లో తనిఖీలు
ABN, First Publish Date - 2020-03-27T09:00:49+05:30
కోవిడ్-19 నియంత్రణలో భాగంగా మూడు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని డివిజనల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.సుదర్శన్‌బాబు తెలిపారు.
గుడివాడ, మార్చి 26 : కోవిడ్-19 నియంత్రణలో భాగంగా మూడు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని డివిజనల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.సుదర్శన్‌బాబు తెలిపారు. గురురాజు హోమియో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. గుడివాడ డివిజన్ పరిధిలో గుడివాడ, కైకలూరు, కూచిపూడిల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గుడివాడలో 50 పడకలు, కైకలూరు ఆటపాక శ్రీచైతన్య పాఠశాలలో 50, కూచిపూడి సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో వంద పడకలతో వార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
గుడివాడ డివిజన్‌లో పాజిటివ్ కేసుల్లేవ్
డివిజన్‌లో ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారు 210 మంది ఉన్నారని, అయితే, ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. కార్వంటైన్ కేంద్రాల్లో మూడు షిప్టుల్లో వైద్యులు విధులు నిర్వర్తిస్తారన్నారు. గుడివాడ వార్డు ఇన్‌చార్జి రాజ్‌కుమార్, ప్రత్యేకాధికారి అర్బానీ, డాక్టర్ ఆనందబాబు, సతీష్, మఽధు తదితరులు పాల్గొన్నారు.
కూచిపూడి :
కూచిపూడిలోని సంజీవని వైద్యశాలలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు మొవ్వ మండల వైద్యాధికారి డాక్టర్ శొంఠి శివరామకృష్ణారావు తెలిపారు. పలువురు అధికారులతో కలసి గురువారం వసతులను పరిశీలించారు. ఐసోలేషన్ వార్డులో 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తారని తెలిపారు. ఎస్సై అబీబ్ బాషా, డాక్టర్ చరణ్, డాక్టర్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
పెడన:
ఎమ్మెల్యే జోగి రమేష్ గురువారం పెడన మునిసిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. విదేశాల నుంచి పెడన నియోజకవర్గానికి వచ్చిన 47 మంది వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్ పి. మధుసూదనరావు, ప్రత్యేకాధికారి రఘునంద, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, సీఐ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సహాయ ఫౌండేషన్ సరఫరా చేసిన మాస్క్‌లను ఎమ్మెల్యే పట్టణంలో పంపిణీ చేశారు.
పల్లోటి స్కూల్‌ల్లో..
పెడనలోని పల్లోటి స్కూల్‌లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. వార్డును గురువారం ఎమ్మెల్యే జోగి రమేష్ పరిశీలించారు. నిర్వహణపై అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
Updated Date - 2020-03-27T09:00:49+05:30 IST