జనవరి 9న ది బెస్ట్ అవార్డులు
ABN, First Publish Date - 2020-12-15T06:16:25+05:30
బి బెస్ట్ కన్స ల్టెన్సీ, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీతోపాటు మరో సంస్థల ఆధ్వర్యంలో జనవరి తొమ్మిదిన ‘సెలబ్రెటింగ్ విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బి బెస్ట్ కన్సల్టెన్సీ అధినేత కరమ్ కౌరమ్ తెలిపారు.
జనవరి 9న ది బెస్ట్ అవార్డులు
విజయవాడ కల్చరల్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): బి బెస్ట్ కన్స ల్టెన్సీ, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీతోపాటు మరో సంస్థల ఆధ్వర్యంలో జనవరి తొమ్మిదిన ‘సెలబ్రెటింగ్ విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బి బెస్ట్ కన్సల్టెన్సీ అధినేత కరమ్ కౌరమ్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రా అర్ట్స్ అకాడమీ అధినేత గోళ్ల నారాయణరావు, వెలగా జోషి, రంగనాథ్, చంద్రిక, భార్గవ్ పాల్గొన్నారు. మొత్తం 30 రంగాల్లో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి ది బెస్ట్ అవార్డులను అందజేస్తామన్నారు.
Updated Date - 2020-12-15T06:16:25+05:30 IST