ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులు.. వేధింపులు

ABN, First Publish Date - 2020-04-28T09:16:19+05:30

కేసులని.. మహిళలను సైతం స్టేషన్‌కు రమ్మని పోలీసుల వేధింపులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కేసులని.. మహిళలను సైతం స్టేషన్‌కు రమ్మని పోలీసుల వేధింపులు. ప్రభుత్వానికి భూములు ఇచ్చి నందుకు బతుకు రోడ్డు పాలైంది. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. అంటూ అమరావతి మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలనంతా అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందో ళనలు సోమవారానికి 132వ రోజుకు చేరాయి.


అమ రావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఎవరి ఇళ్లలో వారే ఉంటూ అనంత వరం, పెదపరిమి, నెక్కల్లు, పొన్నెకల్లు, మందడం, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉద్దండ రాయునిపాలెం, నీరుకొండ, కొరగల్లు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు, కూలీలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అక్రమ కేసులుపెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారంటూ రాజధాని రైతులు, మహిళలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిరసనలో భాగంగా అమరావతి మహిళలు సొంతగా తయారు చేసిన మాస్కులను వారికి అందజేశారు.    

Updated Date - 2020-04-28T09:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising