ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు దుర్గమ్మకు

ABN, First Publish Date - 2020-11-16T11:31:42+05:30

కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రదోష కాలంలో ఇంద్రకీలాద్రిపై ఆకాశ దీపం ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజులతో అలంకారం 

ఇంద్రకీలాద్రిపై ఆకాశ దీపం


విజయవాడ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రదోష కాలంలో ఇంద్రకీలాద్రిపై ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో ఆలయ ఈవో ఎం.వి. సురేశ్‌బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ప్రధానాలయంతోపాటు శివాలయం, నటరాజస్వామి దేవస్థానాల్లో ‘ఆకాశ దీపం’ ఏర్పాటు చేశారు. సోమవారం దుర్గమ్మకు గాజులతో విశేష అలంకారం చేయనున్నారు.


అమ్మవారికి గాజులంటే చాలా ఇష్టం. ప్రతిఏటా కార్తీక మాసంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసి, ఆలయాన్ని కూడా గాజులతో అలంకరిస్తారు. ఈ ఏడాది కరోనా కారణంగా ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని మాత్రమే గాజులతో అలంకరించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు మల్లేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మీగణపతి పంచాక్షరి పఠనాలు, ప్రత్యేక బిల్వార్చనలు, సహస్ర లింగార్చనలు, త్రికాల అభిషేకాలు నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-11-16T11:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising