ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండాలమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు తెస్తా

ABN, First Publish Date - 2020-11-13T11:42:30+05:30

వేమవరం కొండాలమ్మ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ఉన్నత దేవాలయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుస్తానికి కృషి చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి కొడాలి నాని

గుడ్లవల్లేరు, నవంబరు 12 :వేమవరం కొండాలమ్మ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ఉన్నత దేవాలయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుస్తానికి  కృషి చేస్తానని  పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. కొండాలమ్మ   ఆలయ ఈవో నటరాజన్‌ షణ్ముగం, పాలక మండలి చైర్మన్‌ కనుమూరి రామిరెడ్డి, పాలకవర్గ సభ్యులతో గురువారం ఆయన సమావేశమ య్యారు.   ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా ఉండేవిధంగా అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ వీలైనంత త్వరితగతిన రూపొందించాలని ఈవో నటరాజన్‌ షణ్ముగంకు మంత్రి నాని ఆదేశించారు. భక్తుల మనోభావాలకనుగుణంగా ఆలయ అభివృద్ధికి రూపకల్పన చేయాలన్నారు. గతంలో తయారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను ఈవో షణ్ముగం చూపించగా  ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా ప్లాన్‌  సిద్ధం చేయాలని సూచించారు. 


హుండీల ఆదాయం రూ.15.89లక్షలు

వేమవరం  కొండాలమ్మ  దేవస్థానంలోని హుండీల కానుకలను గురువారం లెక్కించారు.  30 రోజులకు రూ.15.89 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో  నటరాజన్‌ షణ్ముగం తెలిపారు. పాలక మండలి చైర్మన్‌ కనుమూరి రామిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పడవల వెంకటేశ్వరరావు, ఈడే విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T11:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising