మైలవరం వీరప్పన్ వసంత : ఉమా
ABN, First Publish Date - 2020-11-13T11:31:17+05:30
‘నువ్వు కొండపల్లి అడవి దొంగవి.. మైలవరం వీరప్పన్‌వి’..
మైలవరం, నవంబరు 12 : ‘నువ్వు కొండపల్లి అడవి దొంగవి.. మైలవరం వీరప్పన్‌వి’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మైలవరంలో ఉమా విలేకర్లతో మాట్లాడుతూ, కొండపల్లి రిజర్వు ఫారెస్టు నుంచి ఎమ్మెల్యే, అతని బామ్మర్ది అనుచరులు వేల ట్రక్కుల గ్రావెల్ దోచేస్తే, ప్రశ్నించినందుకు బూతులు తిట్టిస్తున్నాడన్నారు. జక్కంపూడిలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వెళ్లి, గ్రావెల్ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టించాడన్నారు. ‘ఐదేళ్లకొక పార్టీ మార్చే నీకు నిబద్ధత ఎక్కడుంది? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీలో ఉంటావో లేదో, ఆ పార్టీ జెండా కప్పుకొని చస్తావో లేదో చెప్పాలి’. అని ఎమ్మెల్యేనుద్దేశించి ఉమా ప్రశ్నించారు.
Updated Date - 2020-11-13T11:31:17+05:30 IST