ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాషతోనే జాతి నిలబడుతుంది

ABN, First Publish Date - 2020-11-03T11:20:18+05:30

ప్రపంచంలో ఏ జాతి అయినా తమ భాషను కాపాడుకుంటేనే ఆ జాతి నిలబడుతుందని కమలానంద భారతి స్వామిజీ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కమలానంద భారతీ స్వామి


అవనిగడ్డ టౌన్‌, నవంబరు 2 : ప్రపంచంలో ఏ జాతి అయినా తమ భాషను కాపాడుకుంటేనే ఆ జాతి నిలబడుతుందని కమలానంద భారతి స్వామిజీ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ముక్తేశ్వరరావు రచించిన ‘మాతృభాష న్యాయం’ అనే గ్రంథాన్ని ఆయన ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 5వేల ఏళ్లక్రితమే ఆంధ్రదేశానికి చర్రిత ఉందని, సురవరం ప్రతాప్‌రెడ్డి రచిం చిన ఆంధ్రుల సాంస్కృతిక చరిత్రలో తెలుగు భాష, సంస్కృతికి సంబంధిం చిన అనేక విషయాలు ఉన్నాయన్నారు. దురదృష్టవశాత్తు నేటి పాల కుల వల్ల తెలుగు భాషకు తెగులు తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధన ద్వారా పిల్లల్లో మానసిక వికాసం పెంపొందుతుందని అనేక సర్వేలు తెలిపాయన్నారు.


నాడు బ్రిటీష్‌ పాలకులే భాషను నిర్వీర్యం చేయలేకపోయారని, కానీ నేడు సీఎం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారన్నారు. యునెస్కో సైతం ఆయా దేశాలను ఉత్తమ ప్రాంతీయ భాషలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు భాష రాష్ట్రమని, ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే కార్పొరేట్‌ పాఠశాల్లో తెలుగును బోధించాలని చట్టం చేయాలని సవాల్‌ విసిరారు. అనంతరం స్వామిని దుశ్శాలువా, పూలమాలలతో సన్మానించారు. 

Updated Date - 2020-11-03T11:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising