ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతులకు సంఘీభావం

ABN, First Publish Date - 2020-11-03T11:18:50+05:30

అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావాలు వెల్లువెత్తాయి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం, కేవీపీఎస్‌ నాయకులు సోమవారం దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

321వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు, దీక్షలు


తుళ్లూరు : అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావాలు వెల్లువెత్తాయి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం, కేవీపీఎస్‌ నాయకులు సోమవారం దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు. తుళ్లూరులో దీక్షలో పాల్గొన్న ఓ బాలుడు సొమ్మసిల్లి పడిపోయాడు. కాగా, అమరావతి కోసం చేస్తున్న ఆందోళనలు సోమవారం 321వ రోజుకు చేరాయి. కృష్ణాయపాలెంలో 24 గంటల దీక్ష చేపట్టిన రైతుల కుటుంబాలను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించి ప్రసంగించారు. స్థానిక రైతు కుటుంబాలను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలీ, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఏ.మాల్యాద్రి పరామర్శించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో, మంగళగిరి మండలం యర్రబాలెం, కృష్ణాయపాలెం, నీరుకొండ, బేతపూడి, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడకలో దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి.

Updated Date - 2020-11-03T11:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising