ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై సమరశంఖం

ABN, First Publish Date - 2020-10-31T08:29:17+05:30

ప్రజలంతా అవగాహనతో మెలుగుతూ, జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సమరశంఖం పూరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామలింగేశ్వరనగర్‌, అక్టోబరు 30: ప్రజలంతా అవగాహనతో మెలుగుతూ, జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సమరశంఖం పూరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. కరోనాను అరికట్టాలంటూ బెంజిసర్కిల్‌ నుంచి పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ వరకు శుక్రవారం రాత్రి భారీ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. కాటంనేని భాస్కర్‌, ఇంతియాజ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించండి, భౌతిక దూరం పాటించండి, కరోనా వైరస్‌ను పారదోలండి అనే నినాదాలతో ర్యాలీ ముందుకు సాగింది.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని, నిబంధనలు పాటిస్తూ ప్రతి రంగంలోనూ యాక్టివిటీ నిర్వహించాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌  కె.మాధవీలత, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీలు ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T08:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising