స్వచ్ఛత ఉద్యమానికి రూ.15వేల కోట్లు
ABN, First Publish Date - 2020-10-03T11:30:39+05:30
పరిశుభ్రత కోసం కేంద్రం చేపట్టిన స్వచ్ఛతా ఉద్యమానికి రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించినట్టు నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావార్ చెప్పారు.
నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్
విజయవాడ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత కోసం కేంద్రం చేపట్టిన స్వచ్ఛతా ఉద్యమానికి రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించినట్టు నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావార్ చెప్పారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 3.29 కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తారన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో స్వచ్ఛతా ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రం స్వచ్ఛ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయని చెప్పారు.
స్వచ్ఛతపై పట్టణాలు, నగరాల్లో అవగాహన బాగున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గీతాబాయి, నాబార్డు జీఎం ఉదయ్ భాస్కర్, డీజీఎం రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-03T11:30:39+05:30 IST