ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్లవల్లేరు’ విద్యార్థులకు జాతీయ ర్యాంకులు

ABN, First Publish Date - 2020-10-02T08:40:44+05:30

గుడ్లవల్లేరు వి.వి.ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాలలో బిఫార్మసీ పూర్తిచేసిన ఏడుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మణరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడ్లవల్లేరు : గుడ్లవల్లేరు వి.వి.ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాలలో బిఫార్మసీ పూర్తిచేసిన ఏడుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మణరావు తెలిపారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చి జాయింట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు గత నెల 28న జాతీయస్థాయిలో నిర్వహించారు. తమ విద్యార్థులు సీహెచ్‌ జోషి 121వ ర్యాంకు, వి.ప్రసన్నాంజనేయులు 166వ ర్యాంకు, అబ్దుల్‌ షకీరా 317వ ర్యాంకును, బి.వల్లిదేవి 736వ ర్యాంకు, ఎ.అశ్వని 1115, పి. ఐశ్వర్య 1590, పి.దీప్తి 1790 ర్యాంకు సాధించారని పేర్కొన్నారు.


ఈ పరీక్షల్లో ర్యాంక్‌ సాధించిన వారు మాత్రమే ఎన్‌ఐపీఈఆర్‌ విద్యాసంస్థల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశముంటుందని ప్రిన్సిపాల్‌ అన్నారు. విజేతలను కళాశాల యాజమాన్యం చైర్మన్‌ డాక్టర్‌ వి.నాగేశ్వరరావు, కార్యదర్శి వి.సత్యనారాయణరావు, సహకార్యదర్శి వి. రామకృష్ణ అభినందించారు. 

Updated Date - 2020-10-02T08:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising