ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో 543 రకాల సేవలు

ABN, First Publish Date - 2020-10-01T07:47:22+05:30

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 543రకాల సేవలను పారద ర్శకంగా అందిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత

 పది రోజుల్లో రైస్‌కార్డు జారీ


గుడివాడ, సెప్టెంబరు 30 :  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 543రకాల సేవలను పారద ర్శకంగా అందిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, రూరల్‌లోని సచివాలయాల అధికారులు, వీఆర్వోలు, మండలస్థాయి అధికారులతో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు.


ప్రజలు ఎంపీడీవో, పురపాలక సంఘ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్దకే సేవలు అందించేలా ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో రైస్‌కార్డు అందజేయాలని ఆదేశించారు. ఫిర్యాదులను తక్షణం పరిష్కరించి వాటిని ఆన్‌లైన్‌ నమోదు చేయాలని ఆదేశించారు. ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌ సచివాలయ ఉద్యోగులతో ప్రతిరోజూ సమీక్ష జరపాలన్నారు. ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌, ఎంపీడీవో వెంకటరమణ, పురపాలక సంఘ కమిషనర్‌ జి.సంపత్‌కుమార్‌,  తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


గుడివాడ రూరల్‌ : ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలను సచివాలయ ఉద్యోగులు ప్రజల వద్దకు చేరేలా కృషి చేయాలని జేసీ మాధవీలత అన్నారు. బిళ్లపాడు గ్రామ సచివాలయం కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు.  కేంద్రాలు సమర్థంగా  పని చేయాలని, ఈ క్రాప్‌ అమలు చేయాలన్నారు. 

Updated Date - 2020-10-01T07:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising