ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు బాపు మ్యూజియం ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-01T07:40:54+05:30

చారిత్రక వస్తువులు, పురావస్తు శిల్పకళ సంపద, 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులతో నగరంలోని బాపు మ్యూజియం ప్రత్యేకతను సంతరించుకుందని రాష్ట్ర ఆర్కియాలజీ, మ్యూజియం కమిషనర్‌ జి.వాణీమోహన్‌ పేర్కొన్నారు. స్థానిక బాపు మ్యూజియం ఆవరణలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీ : చారిత్రక వస్తువులు, పురావస్తు శిల్పకళ సంపద, 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులతో నగరంలోని బాపు మ్యూజియం ప్రత్యేకతను సంతరించుకుందని రాష్ట్ర ఆర్కియాలజీ, మ్యూజియం కమిషనర్‌ జి.వాణీమోహన్‌ పేర్కొన్నారు. స్థానిక బాపు మ్యూజియం ఆవరణలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మ్యూజియాన్ని గురువారం సీఎం జగన్‌ ప్రారంభిస్తారని చెప్పారు.


బాపు మ్యూజియం యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఆ చిత్రాలను స్కాన్‌చేస్తే వాటి చరిత్రను మాటల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో ఆర్కియాలజీ డీడీ స్వామినాయక్‌ పాల్గొన్నారు.


ఏర్పాట్ల పరిశీలన

బాపు మ్యూజియం వద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఇతర అధికారులు బుధవారం పరిశీలించారు. మ్యూజియాన్ని గురువారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. కాగా, ఏర్పాట్లను రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రాష్ట్ర ఆర్కియాలజీ, మ్యూజియం శాఖ కమిషనర్‌ జి.వాణీమోహన్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌, వీఎంసీ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీ కె.మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర తదితరులు బుధవారం పరిశీలించారు. ఈనెల 2వ తేదీన గాంధీ జయంతి నుంచి ఈ మ్యూజియం నగర ప్రజలు సందర్శించేందుకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-10-01T07:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising