ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చారు: భానుప్రకాష్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-01T18:03:45+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా కాకుండా రుణాంధ్రప్రదేశ్‌గా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా కాకుండా రుణాంధ్రప్రదేశ్‌గా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రూ.84,617కోట్లను వైసీపీ ప్రభుత్వం తేగా.. అప్పుల రూపంలో రూ.47,130 కోట్లు తెచ్చిందని తెలిపారు. ఈ ఐదు నెలల కాలంలో‌ చేసిన అప్పులు, పెట్టిన ఖర్చులు‌ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్న పధకాలకు కూడా సొంత పేర్లు పెట్టుకుంటున్నారని... ఎక్కడా కూడా మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి అన్ని పార్టీలతో ఉన్న అనుబంధమే..వైసీపీతో ఉందని తెలిపారు. ఆ పార్టీతో ప్రత్యేకంగా దగ్గరగా ఉండటం అనేది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే హిందూ ఆలయాల పై‌దాడులు పెరిగాయని ఆరోపించారు. మతి స్థిమితం లేని ‌వారు కేవలం ఆలయాల పైనే దాడులు‌ చేస్తారా అని ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని.. ఆయన‌ వ్యాఖ్యలతో హిందువులు మనోభావాలు దెబ్బ తిన్నాయని మండిపడ్డారు. కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని సీఎంని కోరినా స్పందించడం లేదన్నారు.


తమ నేత దగ్గుబాటి పురంధరేశ్వరికి కూడా కులం ఆపాదించడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి.. జగన్‌లు.. కుల మతాల పేరు చెప్పి విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు. కుల పిచ్చి తమకు ఎంత ఉందో అందరకీ తెలుసన్నారు. ఏయే వర్గాలకు ఏ పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఏపీకి ముఖ్యంత్రి.. ఒక వర్గానికో.. ఒక ప్రాంతానికో కాదని హితవుపలికారు. కొంతమంది మేలు కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. భక్తులు డబ్బుతో తిరుమల ఆలయం నడుస్తుందని... ఆ డబ్బును తీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇతర మత సంస్థల నుంచి డబ్బులు తీసుకునే ధైర్యం జగన్‌కు ఉందా అని నిలదీశారు. ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి లేదని.. అందుకే వెంకన్న సొమ్ముపై కన్నేశారని విమర్శించారు. చేసిన అప్పులు, పెట్టిన ఖర్చులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల‌  డిమాండ్ చేశారు. నిన్నటి బాబ్రీ మసీజ్ కూల్చివేతపై కోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీ తప్పు లేదని తేలిపోయిందన్నారు. ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలు అవాస్తవం అని అందరకీ అర్ధమైందని భానుప్రకాష్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2020-10-01T18:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising