ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి బాలినేనిని బర్తరఫ్‌ చేయాలి

ABN, First Publish Date - 2020-07-17T10:02:01+05:30

రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు సంబంధించిన కారులో తరలిస్తున్న రూ.5కోట్ల27 లక్షల నగదు మద్రాస్‌లో పట్టుపడిందని, వెంటనే మంత్రి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు


విద్యాధరపురం, జూలై 16 : రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు సంబంధించిన కారులో తరలిస్తున్న రూ.5కోట్ల27 లక్షల నగదు మద్రాస్‌లో పట్టుపడిందని, వెంటనే మంత్రి వర్గం నుంచి బాలినేని శ్రీనివాస్‌ను బర్తరఫ్‌ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు డిమాండ్‌ చేశారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మంత్రులు సొంతకార్లలో అక్రమంగా ఆర్థిక వనరులను తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ లైసెన్స్‌ ఇచ్చి మద్దతు ఇస్తుందన్నారు. ఈ కేసుని ఈడీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పట్టుబడ్డ వెంటనే కార్‌ స్టిక్కర్‌ నాది కాదని బాలినేని శ్రీనివాస్‌ మాట మార్చేశారన్నారు. మద్రాస్‌లో ఉన్న వై.ఎస్‌.భారతి బంధువు సుధాకర్‌ రెడ్డికి ఆ డబ్బు చేర్చేందుకే ఆ కారు వెళ్లిందన్నారు. 13 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు, అక్రమాలు, అవినీతికి పాల్పడుతూనే ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని తెలిపారు.


దుర్గమ్మకు సీపీ దంపతుల పవిత్ర సారె

వన్‌టౌన్‌, జూలై 16 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనక దుర్గమ్మకు గురువారం నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు దంపతులు పవిత్ర సారె సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా దుర్గమ్మకు రెండేళ్ల నుంచి వన్‌టౌన్‌ పీఎస్‌ నుంచి పవిత్ర సారె సీపీ దంపతులు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది స్టేషన్‌ ప్రాంగణంలోని రావి చెట్టు వద్ద సీపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గగుడికి వెళ్లి దుర్గమ్మను దర్శించుకుని సారె సమర్పించారు. కమిటీ చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవి సురేష్‌బాబు, స్థానాచార్యులు వి.శివప్రసాద్‌శర్మ వారికి స్వాగతం పలికి దుర్గమ్మ సన్నిధికి తీసుకెళ్లారు. వెస్ట్‌ ఏసీపీ కె.సుధాకర్‌, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు దంపతులు, భవానీ పురం, కొత్తపేట, ఇబ్రహీంపట్నం సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-07-17T10:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising