ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తమామల హత్యకేసులో నిందితుడు అరెస్టు

ABN, First Publish Date - 2020-12-19T06:06:13+05:30

కట్నం ఇవ్వలేదనే కోపంతో భార్యతో కలిసి అత్తమామల పీకకోసి హత్యచేసిన బండిపాలెం గ్రామ వలంటీరును, మైనర్‌ అయిన అతని భార్యను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహకరించిన భార్య కూడా..

జగ్గయ్యపేట, డిసెంబరు 18: కట్నం ఇవ్వలేదనే కోపంతో భార్యతో కలిసి అత్తమామల పీకకోసి హత్యచేసిన బండిపాలెం గ్రామ వలంటీరును, మైనర్‌ అయిన అతని భార్యను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి చెప్పారు. శుక్రవారం స్థానిక శాంతిభద్రతల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. బండిపాలెంలో కోట ముత్తయ్య రెండో భార్య సుగుణమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఆ గ్రామంలో వలంటీరుగా పనిచేస్తున్న నెమలి బాబురావు ముత్తయ్య రెండో కుమార్తెను ప్రేమించాడు. వివాహానికి రెండు వైపుల వాళ్లు అంగీకరించలేదు. ఆమెను తీసుకెళ్లి నందిగామ పల్లగిరి గట్టుపై నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కుల పంచాయతీలో లక్ష రూపాయలు కట్నం ఇచ్చేందుకు ముత్తయ్య దంపతులు ఒప్పుకున్నారు. ఆ డబ్బు ఇవ్వకపోవటంతో అత్తమామలను హతమార్చాలని బాబూరావు నిర్ణయించుకున్నాడు. మైనర్‌ అయిన భార్య సహకారం తీసుకున్నాడు. ఈ నెల 15న ఇంట్లో నిద్రపోతున్న ముత్తయ్యను... భార్యతో కలిసి బాబురావు, సుగుణమ్మను కత్తితో చాతిపై పొడిచి, పీకకోసి చంపాడు. ఆ సమయంలో అక్కడ నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను బెదిరించి వదిలేశారు. ముత్తయ్య మొదటి భార్య కుమారుడు కోట సుందరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాబురావును, అతని భార్యను అరెస్టు చేసినట్లు చెప్పారు.  

Updated Date - 2020-12-19T06:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising