ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీకి ర్యాలీగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ABN, First Publish Date - 2020-11-30T16:10:23+05:30

భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని... వెంటనే పరిహారం చెల్లించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించి రబీలో పెట్టుబడులకు ఆసరా ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా నీళ్లలో మునిగి దెబ్బతిన్న ధాన్యం కంకులు, పత్తి గూడ, ఇతర పంట ఉత్పత్తులతో  టీడీపీ ప్రజాప్రతినిధుల ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.


‘‘నివర్ తుపాన్ బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలి. 

జీవనోపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలి

ప్రతి పేద కుటుంబానికి రూ10వేలు అందించాలి’’.


 ‘ప్రీమియం రైతులు చెల్లించకుండా అడ్డంపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం కడ్తామన్న ప్రీమియం చెల్లించలేదు.

రైతులను నమ్మించి మోసం చేశారు, నమ్మకద్రోహం చేశారు.

కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్  రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి’’


‘‘మైక్రో ఇరిగేషన్ సబ్సిడీకి మంగళం పాడారు

క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొట్టి మోసం చేశారు.

ఇన్ పుట్ సబ్సిడి, విపత్తు పరిహారం ఎగ్గొట్టారు.

రైతుద్రోహి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ ’’


‘‘ రైతులకు రూ20వేల కోట్ల భరోసా ఎగ్గొట్టారు

.‘‘అన్నదాత సుఖీభవ’’ రద్దు చేశారు.

రుణమాఫీ ఎగ్గొట్టి రూ8వేల కోట్ల మోసం చేశారు’’


‘‘మోటార్లకు మీటర్లు పెడితే.. ఖబడ్దార్

రైతులే వైసిపిని తరిమితరిమి కొడతారు’’.


‘‘వ్యవస్థలను ధ్వంసం చేశారు..విధానాలను నాశనం చేశారు.

ప్రీమియం కడ్తానని మోసం చేశారు.

కేంద్రం ఇచ్చే ఇన్సూరెన్స్ వాటా పోయింది.

రాష్ట్రం కట్టాల్సిన ఇన్సూరెన్స్ వాటా ఎగ్గొట్టారు.

రైతులను కట్టుకోనివ్వకుండా చెడగొట్టారు.

రైతులను నమ్మించి మోసం చేశారు.

ఇది మోసగాళ్ల పాలన..ఇది ఫక్కా 420పాలన..’’  అంటూ ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనకు దిగారు. వైసీపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై టీడీపీ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-11-30T16:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising