ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేక్‌జాబ్‌ స్కాం నిందితుడికి మరో 20 రోజుల గడువు

ABN, First Publish Date - 2020-08-04T10:02:19+05:30

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల దగ్గర అందిన కాడికి వసూళ్లు చేసి వారి నెత్తిన టోపీ పెట్టిన నిందితుడు, ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల దగ్గర అందిన కాడికి వసూళ్లు చేసి వారి నెత్తిన టోపీ పెట్టిన నిందితుడు, వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నేత వడ్డాన రవికుమార్‌కు లిఖిత పూర్వక వివరణ ఇవ్వడానికి మరో 20 రోజుల గ డువును ఆర్టీసీ ఇచ్చింది. బాధితుల ఫిర్యాదులతో అరెస్టు అయి ప్రస్తుతం జైలులో ఉన్న రవికుమార్‌ ఆర్టీసీ చర్యల నుంచి తప్పించు కోవటానికి గడువుల మీద గడువులు కోరుతున్నాడు.


జూలైతో ఇచ్చిన గడువు అయిపోవడంతో.. తాను జైలులో ఉన్నానని, ప్రస్తుతం వివరణ ఇవ్వలేనని తనకు గడువు కావాలని రవికుమార్‌ తాజాగా కోరిన సంగతి తెలిసింది. దీనిపై గడువు ఇవ్వకూడదని ముందుగా ఆర్టీసీ భావించినా.. ఇదే ఫైనల్‌ అంటూ మరో 20 రోజుల అవకాశాన్ని కల్పించింది. అప్పటికీ ఆర్టీసీ చర్యలు తీసుకోకపోతే.. ఉద్దేశపూర్వకంగా తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. 

Updated Date - 2020-08-04T10:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising