ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని గ్రామాల్లో ఆగిన మరో రైతు గుండె

ABN, First Publish Date - 2020-10-25T19:07:35+05:30

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గత 311 రోజులుగా రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గత 311 రోజులుగా రైతులు, కూలీలు, మహిళలు దీక్షలు చేపట్టిన విషయం విదితమే. అయితే ఈ రైతులకు పోటీగా మూడు రాజధానులకు మద్దతిస్తూ కొందరు రైతులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ శిబిరాలు ఏర్పాటు చేసి కొందరు నేతలు హడావుడి చేస్తున్నారు. దీంతో అల్లర్లు చెలరేగే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో పలువురు రైతులు తుదిశ్వాస విడిచారు. తాజాగా మరో రైతు గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


ఆగిన మరో రైతు గుండె..

పూర్తి వివరాల్లోకెళితే.. 


నీరుకొండ గ్రామానికి చెందిన మాదల రామారావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందారు. 

రాజధాని నిర్మాణానికి తనకున్న 90 సెంట్ల భూమిని ఇచ్చారు. అంతేకాకుండా

 

ప్రతి రోజు అందరి రైతుల లాగే రాజధాని కోసం జరిగే ఆందోళనలో పాల్గొనేవారని గ్రామస్తులు చెబుతున్నారు. 


రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో ఇవాళ రైతు గుండె పోటుతో మృతి చెందారని స్థానికులు, తోటి రైతులు మీడియాకు తెలిపారు. రామారావు మరణంతో నీరుకొండలో విషాదఛాయులు అలుముకున్నాయి. ఆయన కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే నీరుకొండ ప్రాంతానికి చెందిన రైతు వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం మరణించారు.

Updated Date - 2020-10-25T19:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising