ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవేదన.. ఆక్రందన..

ABN, First Publish Date - 2020-08-10T10:05:47+05:30

భూములిస్తామని తాము ప్రభుత్వం వద్దకు వెళ్లలేదని, ప్రభుత్వమే తమ వద్దకు వచ్చిభూములు తీసుకుందని రైతులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు/తాడికొండ/మంగళగిరి క్రైం, ఆగస్టు 9 : భూములిస్తామని తాము ప్రభుత్వం వద్దకు వెళ్లలేదని, ప్రభుత్వమే తమ వద్దకు వచ్చిభూములు తీసుకుందని రైతులు తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా అని ప్రశ్నించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని రాజధాని రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం ఆదివారం 236వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి, మందడం, రాయపూడి, వెలగపూడి, అబ్బరాజుపాలెం తదితర గ్రామాల్లోని రైతు శిబిరాల్లో నిరసనలు, దీక్షలు కొనసాగించారు.


కేంద్ర ప్రభుత్వం ద్వందవైఖరి వీడి రైతులకు న్యాయం చేయాలని కోరారు. న్యాయదేవతే తమకు అండగా ఉందన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక, పొన్నెకల్లు గ్రామాల్లో రైతులు, మహిళలు ఆదివారం నిరసనలు వ్యక్తం చేశారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో గ్రామదేవత గంగానమ్మకు ఆదివారం రైతులు, రైతు కూలీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2020-08-10T10:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising