ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతే మా ఆకాంక్ష

ABN, First Publish Date - 2020-04-10T10:14:30+05:30

రాజధాని అమరావతే తమ ఆశ.. ధ్యాస.. ఆకాంక్ష అని రైతులు, మహిళలు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతే తమ ఆశ.. ధ్యాస.. ఆకాంక్ష అని రైతులు, మహిళలు చెబుతున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరు, అనం తవరం, మందడం, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకట పాలెం, బోరుపాలెం, యర్రబాలెం, ఐనవోలు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. ఇళ్లలోనే కూర్చొని వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళ నలు గురువారంకు 114వ రోజుకు చేరుకున్నాయి.


ఆర్‌5పై రైతులను అభిప్రాయాలు చెప్పాలని ఫోన్లు రావడంతో కరోనా విజృంభించి, లాకౌట్‌ విధించిన పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం తీసుకునే పద్ధతి ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేస్తే తమ అభిప్రాయాలు చెప్తామని కొందరు రైతులు అంటున్నారు. ఇప్పటికే పేదలకు 5వేల ఇళ్లను నిర్మించారు.. వాటిని వెంటనే లబ్ధిదారులని డిమాండ్‌ చేస్తున్నారు.  ఉద్యమంలో భాగంగా రాత్రి 7.30 నుంచి 7.35వరకు ఇళ్లలో విద్యుత్‌ను నిలిపివేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. 29 గ్రామాల కూడళ్లల్లో మహిళలు కొవ్వొత్తులు చేత పూని మానవహారాలుగా ఏర్పడి జై అమరావతి అంటూ నిరసనలు తెలిపారు.  

Updated Date - 2020-04-10T10:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising