ఏపీలో శిల్పారామాల నిర్మాణానికి నిధులు మంజూరు
ABN, First Publish Date - 2020-10-03T19:23:37+05:30
రాష్ట్రంలోని శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధుల వినియోగానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
అమరావతి: రాష్ట్రంలోని శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధుల వినియోగానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. తిరుపతిలో శిల్పారామం అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం రూ.10 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు తొలి విడతగా రూ.3 కోట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంజూరు చేసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేసింది.
Updated Date - 2020-10-03T19:23:37+05:30 IST