ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధం: అచ్చెన్న

ABN, First Publish Date - 2020-10-28T17:27:48+05:30

ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా మట్లాడే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్న అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా మట్లాడే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్న అన్నారు. ఆనాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి,  దౌర్జన్యానికి దిగారన్నారు. ఆ సమయంలో అధికార పార్టీ చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని, సభ్యసమాజం సిగ్గుపడేలా ఎన్నికల కమిషనర్‌ను కులం పేరుతో దూషించారని విమర్శించారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య తగాదాలు సృష్టించడం, సంక్షేమం లేకపోవడంతో, ఈ సమయంలో ఎన్నికలు పెడితే దెబ్బతింటామని వైసీపీ భావిస్తోందన్నారు.  


ఎన్నికలకు తాము సిద్ధమని, కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరామని అచ్చెన్న అన్నారు. నామినేషన్ ఆన్ లైన్‌లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలన్నామన్నారు. ఎన్నికల సందర్భంగా అధికారులపై తీసుకున్న చర్యలు అమలు చేయాలని కోరామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని తెలిపామన్నారు. 

Updated Date - 2020-10-28T17:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising