ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుకు తోడుగా.. ఆర్టీసీ వలంటీర్లు

ABN, First Publish Date - 2020-04-03T09:19:33+05:30

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌లో ఉద్యోగ, కార్మికులు వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌లో ఉద్యోగ, కార్మికులు వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్య , పోలీసు సిబ్బందికి సహకారాన్ని ఇచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా గురువారం ఆర్టీసీ సిబ్బంది వలంటీర్లుగా సేవలు అందించారు. పోలీసుస్టేషన్ల వద్ద పోలీసులకు సహకారంగా.. వారు చెప్పిన చోట విధులు నిర్వహించారు. ప్రజలను బయటకు రానివ్వకుండా రోడ్లపై ఉండి వారిని నిలువరించారు. రైతుబజార్ల వద్ద రద్దీని క్రమబద్ధీకరించారు. మార్కెట్ల వద్ద రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు. స్టోర్స్‌, ఏటీఎం ల వద్ద విధులు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులకు వలంటీర్లుగా బాధ్యతలు అప్పగించటంలో గుంటూరులో మాదిరిగా జిల్లాలో వ్యవహరించలేదు. చాలా పరిమితంగానే సిబ్బందిని తీసుకున్నారు.


మహిళా సిబ్బందికి మినహాయింపునిచ్చారు. సేవ చేయటానికి వచ్చిన మహిళా సిబ్బందిని తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది లోపు సిబ్బందికి వలంటీర్ల బాధ్యతలు అప్పగించారు. నగరంలో 400 మంది సిబ్బందికి విధి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గురువారం శ్రీరామనవమి అరునా వలంటీర్లు ఆయా పోలీసు స్టేషన్లకు చేరుకుని హౌస్‌ ఆఫీసర్లను కలుసుకుని రిపోర్టు చేశారు. ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను మాత్రం అందించలేదు.   -ఆంధ్రజ్యోతి, విజయవాడ

    





Updated Date - 2020-04-03T09:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising