ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

95ఏళ్ల బామ్మ... కరోనా విజేత!

ABN, First Publish Date - 2020-09-05T08:42:37+05:30

95ఏళ్ల బామ్మ కరోనాను జయించి విజేతగా నిలిచింది. పాజిటివ్‌తో ఆస్పత్రికి వచ్చిన ఆమె మనోధైర్యంతో 12 రోజుల్లోనే లేచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలుకుంటున్న 12రోజుల పసికందు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ):95ఏళ్ల బామ్మ కరోనాను జయించి విజేతగా నిలిచింది. పాజిటివ్‌తో ఆస్పత్రికి వచ్చిన ఆమె మనోధైర్యంతో 12 రోజుల్లోనే లేచికూర్చుంది. ఆ వృద్ధురాలి పేరు సజ్జా సీతామహాలక్ష్మి. ఆంధ్ర ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్‌ రమణమూర్తి, డాక్టర్‌ పీవీ రామారావు ఆమె మనుమళ్లు. ఆసుపత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఈమెకు 12 రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేస్తే నెగెటివ్‌ వచ్చింది.


  95 ఏళ్ల వయసులో తమ అమ్మమ్మ కరోనా నుంచి కోలుకుందని ఆస్పత్రి డైరెక్టర్‌ రామారావు చెప్పారు. మనోధైర్యంతో ఉంటే కరోనా ఏమీ చేయలేదనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. కాగా, విజయవాడకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నేత మనుమరాలికి కరోనా సోకింది. 12రోజుల ఆ పసికందు కూడా కోలుకుంటోందని చెప్పారు.

Updated Date - 2020-09-05T08:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising