ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ విశ్వరూపం

ABN, First Publish Date - 2020-06-07T07:13:16+05:30

కరోనా మహమ్మారి జిల్లాలో మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే విజయవాడ నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ఒక్కరోజే 25 పాజిటివ్‌ కేసులు


విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా మహమ్మారి జిల్లాలో మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే విజయవాడ నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గొల్లపూడిలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్‌ సోకింది. కృష్ణలంకలో కొత్తగా 6 కేసులు నమోదు కాగా, చిట్టినగర్‌, కొత్తపేట, రామలింగేశ్వరనగర్‌ కట్టపై రెండేసి కేసుల చొప్పున నమోదయ్యాయి. పాతబస్తీలోని బ్రాహ్మణవీధి, భవానీపురం, రామలింగేశ్వరపేట, సత్యనారాయణపురం, బందరురోడ్డు, యనమలకుదురు, గుణదల షిర్డీసాయినగర్‌, ప్రసాదంపాడులో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 526కు చేరుకుంది. అధికారిక లెక్కల ప్రకారం కరోనాతో 22 మంది మరణించగా, రెండు రోజుల క్రితం అజిత్‌సింగ్‌నగర్‌లో ఒకరు, శ్రీనివాసనగర్‌ బ్యాంక్‌ కాలనీలో మరొకరు మరణించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ మరణాలను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. 

Updated Date - 2020-06-07T07:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising