కొవిడ్ టెస్ట్ రూ.1,000
ABN, First Publish Date - 2020-11-13T09:40:50+05:30
రాష్ట్రంలో కొవిడ్ టెస్ట్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కొవిడ్ అనుమానితులు నేరుగా ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి టెస్ట్ చేయించుకుంటే ల్యాబ్‌కు
ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ టెస్ట్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కొవిడ్ అనుమానితులు నేరుగా ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి టెస్ట్ చేయించుకుంటే ల్యాబ్‌కు రూ.1,900 వరకూ చెల్లించేవారు. ఇప్పుడు ఆ ధరను ప్రభుత్వం రూ.1000కు తగ్గించింది. అలాగే, ప్రభుత్వం పంపించిన శాంపిల్స్ ధరను రూ.1,600 నుంచి రూ.800కు తగ్గించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు ల్యాబ్స్‌కు ప్రభుత్వమే శాంపిల్స్ పంపిస్తే పూల్ శాంపిల్స్‌కు కూడా రూ.800 చెల్లిస్తుంది. పూల్ శాంపిల్స్ పరీక్షలు చేసే సమయంలో ఏదైనా శాంపిల్ పాజిటివ్ వస్తే, ఆ పూల్‌లోని అని శాంపిల్స్ రెండోసారి పరీక్ష చేయాల్సి ఉంటుంది. దీనికి మాత్రం ప్రతి శాంపిల్‌కు రూ.800 వరకూ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ధరలు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ల్యాబ్స్‌కు మాత్రమే వర్తిస్తాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే అన్ని ప్రైవేటు ల్యాబ్స్ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు అన్ని టెస్ట్‌ల ధరలను ల్యాబ్‌లు బయట ప్రదర్శించాలని స్పష్టం చేసింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్యశ్రీ సీఈవోకు ప్రభుత్వం అప్పగించింది.
తెలంగాణకు ఆరుగురు పోలీసు అధికారులు
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తుది కేటాయింపుల్లో ఏపీలో పనిచేస్తున్న నాన్ కేడర్ ఎస్పీలు ఎల్. సుబ్బరాయుడు, టి.శ్రీనివాసరావు, అదనపు ఎస్పీలు సమయ్ జాన్ రావు, అరవింద బాబు, డీఎస్పీలు టి.రాధేశ్ మురళి, ఏఎస్పీ బోస్‌లను రిలీవ్ చేస్తూ రాష్ట్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - 2020-11-13T09:40:50+05:30 IST