అసెంబ్లీ సమావేశాలా.. వైసీపీ సమావేశాలా..? :కొల్లు రవీంద్ర
ABN, First Publish Date - 2020-12-01T23:33:24+05:30
అసెంబ్లీ సమావేశాలు వైసీపీ సమావేశాలుగా మారాయని టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
కృష్ణా: అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సమావేశాలుగా మారాయని టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రతిపక్షం గొంతునొక్కేలా వ్యవహరిస్తున్నారని..సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబుతో వ్యవహరించిన తీరు ఇదేనా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘మీరు మంత్రులా.. సన్నాసులా..అరేయ్ ఒరేయ్ అని మాట్లాడతారా..? అని మండిపడ్డారు. ఏ పినాయిల్ పెట్టి కడగాలి మీ నోళ్లను’’ అని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. ఇదేనా ప్రజాస్వామ్య పాలన అని ఆరోపించారు.
మీ స్థాయి తెలుసుకోండి..?
’’కొడాలి నాని గుడివాడలో నీ స్థాయి ఏమిటో తెలుసుకుని మా నాయకుడు చంద్రబాబు గురించి మాట్లాడు అని ప్రశ్నించారు. పేర్ని నాని నీ స్థాయిని కూడా తెలుసుకో‘‘ అని వ్యాఖ్యానించారు. రైతులను నిట్టనిలువునా ముంచిన ప్రభుత్వం మీది కాదా అని మండిపడ్డారు. కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని.. రైతు సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోనే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. G+3 ఇళ్లు కట్టించింది చంద్రబాబు అన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.
Updated Date - 2020-12-01T23:33:24+05:30 IST