ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీపై కొడాలి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-09-23T20:42:37+05:30

ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన.. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో మోదీ బజారున పడపడుతున్నారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన.. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో మోదీ బజారున పడపడుతున్నారని విమర్శించారు. ముందు నరేంద్ర మోదీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన ఆయన... స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు.


ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, డిక్లరేషన్‌పై చర్చ జరగాలన్నారు. అసలు ఈ నిబంధన ఎప్పుడు నుంచి అమలులో ఉందో బహిర్గతం చెయ్యాలని... సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంధం లేదన్నారు. హిందూ దేవాలయంలో హిందువులా... చర్చిలో క్రైస్తవుడిలా... మసీదులో నవాబులా ఉంటారని చెప్పుకొచ్చారు. వేంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. శ్రీవారి దయవల్లే జగన్ సీయం అయ్యారన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎంను టీటీడీ ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలని ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-23T20:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising