ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థల సమాచారం తీసుకునే హక్కుంది: జస్టిస్ కాంతారావు

ABN, First Publish Date - 2020-06-03T20:03:28+05:30

విజయవాడ: పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఇటీవల ఒక నోటిఫికేషన్ ఇచ్చామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఇటీవల ఒక నోటిఫికేషన్ ఇచ్చామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు తెలిపారు. విద్యాసంస్థల సమాచారం తీసుకునే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లారన్నారు. కమిషన్‌పై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. అన్ని విద్యాసంస్థలకు ఒకే ఆర్ధిక స్థితి ఉండదన్నారు. కమిషన్ ఎప్పుడు నియంత్రణకు ప్రయత్నిస్తుందని... ఎవరిని ఇబ్బంది పెట్టదని కాంతారావు తెలిపారు.


ఆంగ్ల మాద్యమం తప్పనిసరి అని ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోర్టు నిలిపివేసిందన్నారు. దీని ప్రకారం ఇంతకుముందున్నదే అమలవుతుందన్నారు. వలంటీర్లు తల్లిదండ్రులను బలవంతంగా ఆంగ్ల మాధ్యమానికి ఒప్పించారని కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కాంతారావు పేర్కొన్నారు. విద్యా విధానాన్ని మార్చడానికి ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారన్నారు. 9వ తరగతి లోపు విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మంచిదని కాంతారావు పేర్కొన్నారు. 


Updated Date - 2020-06-03T20:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising