ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 1000 సాయంపై ఏపీ ఎస్ఈసీ రమేష్‌కు కన్నా లేఖ

ABN, First Publish Date - 2020-04-05T19:42:13+05:30

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా పేదలకు ప్రభుత్వం పంచే వెయ్యి రూపాయిల సాయం విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు.


లేఖలో ఏముంది..!?

కరోనా కారణంగా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన వెయ్యి రూపాయల సాయాన్ని వైసీపీ నేతలు పంపిణీ చేసిన వైనాన్ని మీ‌ దృష్టికి తీసుకొస్తున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా సాయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కరోనా సాయం మొత్తాన్ని గ్రామ/వార్డ్ వాలంటీర్లు పంపిణీ చేయాలి. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, పోటీదారులు హైజాక్ చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ పంపిణీ చేస్తున్నట్లుగా డబ్బును పంపిణీ ప్రచారం చేస్తున్నారు. పంపిణీ చేస్తున్న సహాయాన్ని గుర్తుంచుకోవాలని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని వారు బహిరంగంగా లబ్ధిదారులకు చెబుతున్నారు. ఆ విధంగా వారు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ సందర్భాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ అభ్యంతరంతో ఓటర్లను ప్రేరేపించడం తప్ప మరొకటి కాదు. ఎన్నికల ప్రాథమిక నైతిక నియమావళిని ఉల్లంఘించారు. అధికార పార్టీ అభ్యర్థులకు ప్రయోజనాన్ని కలిగించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించే ఆర్డినెన్స్ ను ప్రకటించినట్లు మీకు తెలుసు. ఏదైనా ప్రేరేపణలు, ఆకర్షణలు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే.. అభ్యర్థులను అనర్హులుగా చేయడమే కాకుండా జైలు శిక్ష మరియు జరిమానా విధించడం ద్వారా శిక్షార్హమైనది. ఈ పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్న కొంతమంది పార్టీ నాయకులు 200/300  రూపాయలను తగ్గించి జేబులో వేస్తున్నారని పలు ప్రసార సాధనాల్లో వార్తలు వచ్చాయి. ప్రపంచం మొత్తం చీకటిలో చిక్కుకున్న సమయంలో ఈ సహాయం కూడా పేద ప్రజలకు పూర్తిగా చేరకపోవడం నిజంగా విచారకరం. కరోనా‌ వ్యాప్తి చెందకుండా కనీస జాగ్రత్తలు కూడా తోసుకోకుండా జనాలకు హాని కలిగేలా చేస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనధికార పంపిణీ వెంటనే ఆపాలని  కోరుతున్నాను. ఇటీవల సవరించిన పంచాయతీ రాజ్ చట్టం యొక్క నిబంధనలను అమలు చేయాలి. అనర్హత వేటు, జైలు శిక్షతో సహా చర్యలను తీసుకోవాలిఅని లేఖలో కన్నా కోరారు.

Updated Date - 2020-04-05T19:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising