ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా వైసీపీ మారింది : కాల్వ

ABN, First Publish Date - 2020-09-21T22:42:38+05:30

అధికార పార్టీ వైసీపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మాజీ మంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : అధికార పార్టీ వైసీపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సోమవారం నాడు అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాధనం దోపిడీ లక్ష్యంగా రాష్ట్రంలో వైసీపీ పాలన ఉందన్నారు. ఇసుక, మట్టి వైసీపీ నాయకుల అవినీతికి ఆనడం లేదని ఆరోపించారు. ఈఎస్ఐ స్కాంలో నిందితునిగా ఉన్న కార్తీక్ నుంచి మంత్రి జయరాం కారు తీసుకున్నారని.. ఇందుకు సంబంధించి అన్ని సాక్ష్యాలతో టీడీపీ నిరూపించిందని కాల్వ చెప్పుకొచ్చారు. మంత్రి అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే జయరాంను మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్ చేసి విచారణ చేయాలని కాల్వ డిమాండ్ చేశారు.


చౌకబారు విమర్శలు!

అమరావతిలో అవినీతి అని 16 నెలలుగా సీఐడీ, సిట్, సీబీఐ, మంత్రి వర్గ ఉపసంఘం అని పాలన గాలికి వదిలేశారు. అమరావతిని చంపాలన్న ఉద్దేశంతోనే రాజధాని నిర్మాణాన్ని పక్కన బెట్టారు. ఉన్మాదానికి ఉగ్రరూపం వస్తే ఎలా ఉంటుందో వైసీపీ నేతల తీరు అలాగే ఉంది. ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటులో న్యాయవ్యవస్థల గురించి వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అరాచకాలపై పోరాతున్నందుకే మాజీ మంత్రి అచ్చెన్నపై కక్షగట్టారుఅని కాల్వ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-09-21T22:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising