అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
ABN, First Publish Date - 2020-12-31T05:02:11+05:30
అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు.
రైల్వేకోడూరు, చిన్నమండెం తహసీల్దారు కార్యాలయాల ఎదుట ధర్నా
రైల్వేకోడూరు, డిసెంబరు, 30: అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అతి తక్కువ జీతాలతో పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పఽథకాలు అందకుండా ఆదేశాలు ఇవ్వడం అన్యాయమని ఆరోపించారు. జీవో 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కాగృహాలు కట్టించాలని ఉన్నా అమలు చేయలేదన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పఽథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కనీస వేతనాలు రూ.21,000 వేలు ఇవ్వాలని, ఇంటి స్థలం తోపాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని, అమ్మఒడి, జగనన్న చేయూత తదితర పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళనలు దశల వారిగా చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఎ్‌సవో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకుడు మౌలాలిబాషా, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు నిర్మల, పద్మావతి, సుజాత, లక్ష్మీదేవి, విమల, ప్రభావతి, గాయత్రి, పెంచలమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చిన్నమండెంలో...
చిన్నమండెం, డిసెంబరు30: అంగన్వాడీలు, హెల్పర్లు, మినీవర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని, అయితే ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇళ్ల స్థలాల్లో అంగన్వాడీ పేర్లను తొలగించారని బుధవారం తహసీల్దార్ జీవీ నాగేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. అమ్మఒడి పథకం అంగన్వాడీలకు అందడం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు నిండి ఎటువంటి పింఛన్ కాకుండా రిలీవ్ చేయడం వలన కుటుంబం ఆదరణ కోల్పోయి, ఒంటరి మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.అంగన్వాడీలకు అమ్మఒడి, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కనీస వేతనం రూ.24 వేలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రేషన్‌కార్డులు తొలగించరాదని తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
Updated Date - 2020-12-31T05:02:11+05:30 IST