కూరగాయల మార్కెట్లు పెంచుతాం : ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2020-03-27T09:42:20+05:30
స్థానిక మున్పిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌కు ప్రజలు గుంపులు గుంపులుగా
ప్రొద్దుటూరు క్రైం, మార్చి 26 : స్థానిక మున్పిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌కు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారని, దీనికి చెక్ పేట్టే విధంగా మరో రెండు కూరగాయల మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ప్రజలు సోషియల్ డిస్టెన్స్ పా టించాల్సిన బాధ్యత ఉందని, ఆ క్రమంలోనే కూరగాయల మార్కెట్‌ను మున్పిపల్ హైస్కూ ల్ మైదానంలోకి, పండ్ల మార్కెట్‌ను త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పక్క కు మార్చామన్నారు.
అ యినప్పటికి కూరగాయల మార్కెట్‌కు ప్రజలు గుంపులుగా వస్తున్నారని, దీనిని నివారించేందుకు రామేశ్వరం ప్రాంత ప్రజల కోసం మున్పిపల్ కార్యాలయ సమీపంలో, మైదుకూరురోడ్డు ఆపై వారికి మైదుకూరురోడ్డులోని కశెట్టి హైస్కూల్‌లో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేగాక అవసరమైతే వలంటీర్ల ద్వారా కూడా ప్రజలకు కూరగాయలు అందించే కార్యక్రమం చేపడతామన్నారు. ప్రజలు కరోనా వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-03-27T09:42:20+05:30 IST