ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్‌శక్తి అభియాన్‌ ద్వారా నీటి వనరులు పెంచాలి

ABN, First Publish Date - 2020-08-11T11:12:34+05:30

జల్‌శక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా నీటి నిల్వల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హరికిరణ్‌


కడప, (కలెక్టరేట్‌) ఆగస్టు 10 : జల్‌శక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా నీటి నిల్వల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ చాంబరులో జల్‌శక్తి అభియాన్‌ జిల్లా సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీటి సంక్షోభాన్ని పరిష్కరించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం జల్‌శక్తి అభియాన్‌ పేరిట దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. దానికి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2019లో నీటి వనరుల పెంపు కోసం సమర్థవంతంగా చేపట్టిన కృషి వల్ల అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 250 జిల్లాల్లో కడప జిల్లాకు మొదటిస్థానం లభించిందని తెలిపారు.


డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. అదే స్ఫూర్తితోనే జల్‌శక్తి అభియాన్‌ ద్వారా జిల్లాలో నీటి వనరుల పెంపుదల, భూగర్భజలాల సంరక్షణ, నీటి వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి, భూగర్భ జలశాఖ డీడీ మురళి, ఆర్‌డబ్ల్వుఎస్‌ ఎస్‌ఈ మల్లికార్జున, అగ్రికల్చర్‌ జేడీ మురళీకృష్ణ, డీఎస్‌వో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T11:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising