ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు వైద్యమందించండి

ABN, First Publish Date - 2020-08-06T06:36:28+05:30

కరోనా బాధితులకు వైద్యమందించేందుకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం ఎస్‌బీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేటు ఆసుపత్రులకు డిప్యూటీ సీఎం పిలుపు


కడప (ఎర్రముక్కపల్లె), ఆగస్టు 5: కరోనా బాధితులకు వైద్యమందించేందుకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా పిలుపునిచ్చారు. కడప స్టేట్‌గెస్ట్‌హౌ్‌సలో బుధవారం ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులు తప్పకుండా కరోనా పేషంట్లకు వైద్యం అందించాలన్నారు.


ఇందుకు జిల్లా యాంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని, కలెక్టరుతో సంప్రదించి డాక్టర్లు కోరిన విధంగా పారామెడికల్‌ స్టాఫ్‌ను ప్రొవైడ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మన జిల్లా నుంచి కరోనా పేషంట్లు చాలా మంది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని, ఇక నుంచి కరోనా పేషంట్లు బయటి ప్రాంతాలకు వెళ్లకుండా కడపలోనే వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని కోరారు. కరోనా వైద్యం అందించే ప్రైవేటు ఆసుపత్రుల్లోని పారామెడికల్‌ స్టాఫ్‌కు ఉద్యోగావకాశాల్లో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మలోలా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సునీల్‌కుమార్‌, తహసీల్దారు శివరామిరెడ్డి, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-06T06:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising