ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుఫాన్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-11-30T04:53:32+05:30

నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

రాయచోటి, నవంబరు29: నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ వల్ల రాయచోటి పట్టణంలోని పాతరాయచోటి, నాయబ్‌సాబ్‌వీధి, కంచాలమ్మ గండి ప్రాంతాల్లో చాలా ఇళ్లు ముంపునకు గురయ్యాయన్నారు. చాలా ఇల్లు కూలిపోయాయని పేర్కొన్నారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కంచాలమ్మ గండి కోతకు గురైన ప్రాంతంలో, మట్టితో అడ్డు వేస్తున్నారన్నారని, అయితే భవిష్యత్తులో తెగితే రాయచోటికి ప్రమాదం ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కంచాలమ్మ గండిని సిమెంటుతో మరమ్మతులు చేయాలన్నారు. కటవ మొత్తం సిమెంటుతో నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ విపత్తు బాధితులను ఆదుకోవడంలో వైసీపీ పాలనలో స్పష్టత కొరవడిందన్నారు.వైసీపీ ప్రభుత్వం చేతగాని పాలనకు బుగ్గవంక, పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజె క్టు ఉదంతాలే ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు.ఈ విపత్తులో బాధితులకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, నరసారెడ్డి, అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, వతన్‌నిస్సార్‌, అతావుల్లా, సాయి, సోనీరాజ్‌ కలీమ్‌, మైనుద్దీన్‌, అల్లావుద్దీన్‌, రాజు, అబుజర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-30T04:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising