ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా.. స్వాహా..!

ABN, First Publish Date - 2020-12-29T06:12:18+05:30

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 - 1.25 లక్షల హెక్టార్లు. 2019 ఖరీ్‌ఫలో ప్రధానమంత్రి పసల్‌ బీమా యోజన - వైఎ్‌సఆర్‌ పంటల బీమా కింద జిల్లాలో పత్తి పంటను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తి సాగు చేసిన ప్రతి రైతు ఎకరాకు రూ.1650 బీమా ప్రీమియం చెల్లించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేని భూమి ఉన్నట్లు.. వేయని పంట వేసినట్లు..

రికార్డుల్లో మాయ చేసి ప్రజాధనం మెక్కేశారు

ఎర్రగుంట్ల మండలం మాలేపాడు కేంద్రంగా రూ.కోట్లు కుంభకోణం

వేంపల్లి మండలంలో ఒకే కుటుంబానికి రూ.18.93 లక్షలు క్లైమ్‌

సెంటు పొలం లేని 41 మందికి క్రాప్‌ ఇన్సూరెన్స 

ముద్దనూరులో ఒకే కుటుంబంలో నలుగురికి రూ12.39 లక్షలు

ఎర్రగుంట్ల, వీఎన పల్లె, పెద్దముడియంలో మండలాల్లోనూ ఇదే పరిస్థితి

2019 ఖరీఫ్‌ పీఎం ఫసల్‌ బీమా యోజన (పత్తి) భారీ అక్రమాలు

సమగ్ర విచారణ చేస్తే భారీ కుంభకోణం 


(కడప-ఆంధ్రజ్యోతి): 

- వీఎన పల్లె మండలం ఓబులరెడ్డిపల్లెకు బరకం నడిపి అయ్యవారప్పకు 12 ఎకరాల పొలం ఉంది. పత్తి సాగు చేశారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా చేశారు. జాబితాలో పేరు లేదు. రిజెక్ట్‌ (తిరస్కరణ) అయ్యిందని అధికారుల తేల్చి చెప్పారు. 

- వేంపల్లి మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఓ రైతు కుటంబానికి 78 ఎకరాలు ఉంది. ఆ రైతు కుటుంబంలో 21 మందికి 198 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో చూపి రూ.18.98 లక్షలు బీమా మంజూరు చేశారు.

- ఎర్రగంట్ల మండలం మాలేపాడు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఐదారు మండలాల్లో భూములు ఉన్నట్లు.. పత్తి సాగు చేసినట్లు రికార్డులు మాయ చేసి రూ.కోట్లు బీమా క్లైం చేసినట్లు సమాచారం.  


ఇది ఎలా సాధ్యం..?

ఎవరిని అడిగినా అసాధ్యమే అంటారు. అయితే.. మన అధికార యంత్రాంగం మాత్రం సుసాధ్యం చేశారు. భూవిస్తీర్ణం రెట్టింపు చేసి.. లేని భూమి 1బీ అడంగల్‌లో ఉన్నట్లు.. వేయని పంటను వేసినట్లు.. వారి పేరున భూమే లేకపోయినా ఉన్నట్లు చూపించి 2019 ఖరీఫ్‌ పీఎం పసల్‌ బీమా పరిహారంలో భారీ అక్రమాలు జరిగాయి. రాజకీయ నాయకుల అండదండలున్న వ్యక్తులతో అధికారులు కుమ్మక్కై ప్రజాధనం మెక్కేశారు. వేంపల్లి, వీఎన పల్లె, ఎర్రగుంట్ల, ముద్దనూరు, తొండూరు, రాజుపాలెం, పెద్దముడియం, మైలవరం మండలాల్లో సమగ్ర విచారణ చేస్తే రూ.కోట్ల కుంభకోణం వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 - 1.25 లక్షల హెక్టార్లు. 2019 ఖరీ్‌ఫలో ప్రధానమంత్రి పసల్‌ బీమా యోజన - వైఎ్‌సఆర్‌ పంటల బీమా కింద జిల్లాలో పత్తి పంటను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తి సాగు చేసిన ప్రతి రైతు ఎకరాకు రూ.1650 బీమా ప్రీమియం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.. రైతు ఎకరాకు రూపాయి చెల్లించి దరఖాస్తు చేస్తే చాలని ప్రభుత్వం చెప్పింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. లేని భూములను రికార్డుల్లో సృష్టించి, దేవదాయ, ప్రభుత్వ భూములు, చివరికి రహదారులు కూడా మావేనంటూ 1బీ అడంగల్‌ సృష్టించి నాన లోనింగ్‌ ఫార్మర్స్‌గా ఆనలైనలో దరఖాస్తు చేశారు. వ్యవసాయ అధికారులు కూడా ధ్రువీకరించారు. బీమా కంపెనీ జిల్లాకు 1.18 లక్షల మందికి రైతులకు రూ.364 కోట్లు పరిహారం మంజూరు చేసింది. వీరిలో అత్యధికంగా పత్తి సాగు చేసినట్లు చూపించిన రైతులే ఉన్నారు. 


ఉన్నది 78 ఎకరాలు.. బీమా క్లైమ్‌ 198 ఎకరాలకు

వేంపల్లి మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఓ రైతు కుటుంబానికి 78 ఎకరాలు భూమి ఉంది. అందులో 30 ఎకరాలు వివాదం వల్ల హైకోర్టు విచారణలో ఉంది. ఆ రైతు కుటుంబ సభ్యులు 21 మంది పేరున 198 ఎకరాలు భూమి ఉన్నట్లు, ఆ భూముల్లో మొత్తం పత్తి సాగు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. 1బీ అడంగల్‌ సృష్టించారు. 2019 పీఎం ఫసల్‌ బీమా యోజన-వైఎ్‌సఆర్‌ పంట బీమాకు దరఖాస్తు చేశారు. ఇది వాస్తవమేనని, ఆ రైతు కుటుంబ సభ్యులు పత్తి సాగు చేశారని వ్యవసాయ అధికారులు ధ్రువీకరించారు. విచారణ కోసం వ్యవసాయ శాఖ కమిషనర్‌ సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కు జాబితా పంపితే అంతా ఓకే అంటూ నిర్ధారించారు. ఆ 21 మందికి రూ.18.93 లక్షలు బీమా క్లైం అయ్యింది. అదే వ్యక్తి సెంటు పొలం లేని మరో 41 మంది పేరున కూడా బోగస్‌ భూరికార్డులు సృష్టించి దరఖాస్తు చేస్తే వారికి కూడా దాదాపుగా రూ.20 లక్షలు క్లైం చేసినట్లు తెలుస్తోంది. ఇది అధికారుల సహకారం లేనిదే సాధ్యమా..? ఇందులో ఎవరి వాటా ఎంతో అధికారులకు ఎరుక. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందన లేదు. 2011-12లోనూ ఇదే వ్యక్తి బీమా రూపంలో రూ.లక్షలు స్వాహా చేసినా నేటికీ చర్యలు శూన్యం. 


మాలేపాడు కేంద్రంగా రూ.కోట్లు కుంభకోణం

ఎర్రగుంట్ల మండలం మాలేపాడు కేంద్రం 2019 పంటల బీమా పరిహారంలో రూ.కోట్లు కుంభకోణం జరిగినట్లు సమాచారం. ఆ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రభుత్వ, దేవదాయ భూములు, రహదారులు కూడా మావే.. ఆ భూముల్లో పత్తి సాగు చేశామంటూ బోగస్‌ రికార్డులు సృష్టించి ఎర్రగుంట్ల, ముద్దనూరు, వీఎన పల్లె, రాజుపాలెం, మైలవరం, ప్రొద్దుటూరు మండలాల్లో పలు గ్రామాల్లో పత్తి సాగు చేసినట్లు పీఎం ఫసల్‌ బీమాకు దరఖాస్తు చేశారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతాను జత చేశారు. ఆ మండల అధికారులు కూడా కళ్లకు గంతలు కట్టుకుని ధ్రువీకరించారు. ఈ బాగోతంలో సుమారుగా రూ.కోట్లు కుంభకోణం జరినట్లు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ గ్రామంలో భూములు లేని, నివాసం లేని వ్యక్తుల పేర్లు బీమా జాబితాలో చూసి నిజమైన రైతులు అవాక్కవుతున్నారు. రికార్డులు, సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలకు తెరతీసినట్లు సమాచారం. ఇదో పెద్ద మాఫియాగా మారిందని తెలుస్తోంది. 


వాస్తవాలు మరికొన్ని..

- ముద్దనూరులో ఓ రైతు తాను, భార్య, తల్లి, తండ్రి నలుగురి పేరున 151 ఎకరాలకు పైగా ఉందని, పత్తి సాగు చేశామని 24 ఖాతాల ద్వారా రూ.12.39 లక్షలు పీఎం ఫసల్‌ బీమా క్లైం చేశారు. రికార్డులను పరిశీలిస్తే ఆ రైతు కుటుంబానికి సుమారుగా 27-30 ఎకరాలకు మించి లేదని గ్రామస్తులు అంటున్నారు. లక్షలు బీమా స్వాహా చేశారు. 

- అదే గ్రామానికి  చెందిన మరో రైతు, అతడి భార్య, తల్లికి సుమారుగా 20 ఎకరాల భూమి ఉంది. అయితే 80 ఎకరాలు ఉందని, పత్తి సాగు చేశానని బోగస్‌ రికార్డులు సృష్టించి సుమారుగా రూ.7.05 లక్షలు బీమా పరిహారం స్వాహా చేశారు.

- ముద్దనూరు గ్రామంలోనే ఓ రైతుకు 13.5 ఎకరాలు ఉంది. బీమా దరఖాస్తులో 33.75 ఎకరాలు ఉందని చూపించి రూ.2.86 లక్షలు బీమా స్వాహా చేశారు. అలాగే.. మరో రైతు 30 ఎకరాలు భూమి ఉంటే.. బోగస్‌ రికార్డులు సృష్టించి ఏకంగా రూ.40 లక్షలు బీమా క్లైం చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. 

- రాజుపాలెం మండలంలో 37 ఎకరాల దేవుని మాన్యం మాదే అని బోగస్‌ రికార్డులతో ఎర్రగంట్ల మండలం మాలేపాడు గ్రామానికి చెందిన బీమా మాఫియా ప్రజాధనం కొల్లగొట్టారు. ఈ మండలంలో కూడా రూ.20 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు సమాచారం. ప్రొద్దుటూరు, పెద్దముడియం, మైలవరం, తొండూరు మండలాల్లోనూ ఇదే స్థాయిలో భారీగా బీమా అక్రమాలు జరిగినట్లు సమాచారం. 


కఠిన చర్యలు తీసుకుంటాం

- గౌతమి, జాయింట్‌ కలెక్టర్‌

బీమా ప్రీమియం అక్రమాలపై విచారణ చేయిస్తాం. బోగస్‌ రికార్డులతో ప్రీమియం క్లెయిం చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తక్షణమే వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తాం. డబ్బులు డ్రా చేసుకున్నా ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా రికవరీ చేస్తాం. 

- ఈ విషయమై వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణను వివరణ కోరగా రాజుపాలెం మండలంలో అక్రమాలు జరిగినట్లు మాదృష్టికి వచ్చింది. దానిపై విచారణ చేయిస్తున్నాం. ఇతర మండలాల్లో అక్రమాలు మా దృష్టికి రాలేదు. ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-12-29T06:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising