ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంకితభావానికి మారుపేరు శివారెడ్డి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-07-01T10:31:21+05:30

విధి నిర్వహణలో అంకితభావంతో సేవలు అందించి ప్రజలతో మమేకమై సేవలందించిన జాయింట్‌ కలెక్టర్‌-2 శివారెడ్డి సేవలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), జూన్‌ 30 : విధి నిర్వహణలో అంకితభావంతో సేవలు అందించి ప్రజలతో మమేకమై సేవలందించిన జాయింట్‌ కలెక్టర్‌-2 శివారెడ్డి సేవలు మరువలేనివని కలెక్టర్‌ హరికిరణ్‌ కొనియాడారు. మంగళవారం పదవీ విరమణ పొందిన జేసీ-2 శివారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బి.గోపాల్‌, జిఎన్‌ఎ్‌సఎ్‌స-2 స్పెషల్‌ కలెక్టర్‌ ఎం.నాగరాజులకు కలెక్టర్‌ బంగ్లా సమీపంలోని కడపహౌస్‌లో అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రజలకు అందించాల్సిన సేవలను ఎప్పటికప్పడు అంకింతభావంతో చేస్తూ సహోద్యోగులు మొదలు ఉన్నతాధికారుల వరకు తనదైన ముద్ర వేసుకున్న అధికారి జేసీ-2 శివారెడ్డి అన్నారు. జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, సాయికాంత్‌వర్మ శివారెడ్డి సేవలను కొనియాడారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ గోపాల్‌, జీఎన్‌ఎ్‌సఎ్‌స స్పెషల్‌ కలెక్టర్‌-2 నాగరాజులను సన్మానించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ వికా్‌సమర్మాట్‌, పాడా ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి, డీఆర్వో రఘునాధ్‌, ఆర్డీఓలు మలోల, ధర్మారెడ్డి, అధికారులు పద్మజ, రాజశేఖర్‌రెడ్డి, పురుషోత్తం, శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-01T10:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising