ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక చట్టాల రద్దు దారుణం

ABN, First Publish Date - 2020-05-13T07:59:06+05:30

కోరోనా వైరస్‌ ను సాకు గా చూపి కేంద్ర ప్రభుత్వం వెయ్యి రోజులపాటు కార్మిక చట్టాలను రద్దు చేయడం దారుణమని సీపీఐ, ఏఐటీయూసీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, మే 12: కోరోనా వైరస్‌ ను సాకు గా చూపి కేంద్ర ప్రభుత్వం వెయ్యి రోజులపాటు కార్మిక చట్టాలను రద్దు చేయడం దారుణమని సీపీఐ, ఏఐటీయూసీ, మానవ హక్కుల వేదిక నాయకులు విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని నిరసనగా తహసీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు,  మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీలు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాఽధించుకున్న హక్కులను రద్దు చే యడం దారుణమన్నారు.


ఎనిమిది గంటల పని విధానంను 12 గంటలకు పెంచి కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోవడానికి కుట్ర పడుతు న్నారని వారు ధ్వజమెత్తారు.  కార్మికులతో బలవంతం గా పని చేయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కరోనా వల్ల కార్మికులు పని చేయకపోవడం వల్లే దేశ సంపద స్తంభించిందని, ఇప్పటికైనా కార్మికుల ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పరిశ్రమలు, కార్పొరేట్‌ రంగం నుంచి కొంత సొమ్మును ప్రభుత్వ ఖజానాకు మల్లించి కార్మికులకు ఖర్చు చేయాలన్నారు. కార్మిక చట్టాల రద్దును ఉపసంహరించుకోకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం పట్టణంలో ఉన్న వలస కార్మికులను ఆదుకోవాలని తహసీల్దారు చండ్రాయుడుకు వారొక వినతిపత్రాన్ని అందజే శారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, వలస కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-13T07:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising