ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుల భారం దారుణం : టీడీపీ

ABN, First Publish Date - 2020-12-12T04:41:27+05:30

మున్సిపాలిటీ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఆస్థిపన్ను భారం వేయడం దారుణమ ని బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖ ర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేత డాక్టర్‌ రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, డిసెంబరు11: మున్సిపాలిటీ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఆస్థిపన్ను భారం వేయడం దారుణమ ని బద్వేలు నియోజకవర్గ టీడీపీ  నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖ ర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఇప్పటి వరకు పట్టణాల్లో అద్దె విలువ ఆధారంగా పన్నులు వేసేవారని ఇప్పటి నుంచి ఆస్థి విలువ ఆధారంగా పన్నులు వేయబోతున్నారన్నారు. ఆస్థి విలువ, ఇంటి నిర్మాణం ఆధారంగా పన్ను వేయడం దారుణమన్నారు.

ఈ విధానంతో పన్ను 10నుంచి 22 శాతం  పెరిగే అవకాశం ఉందన్నారు. ఏటా భూమి రిజిస్ర్టేషన విలువ, నిర్మాణం విలువ పెరుగుతుందన్నా రు. దానికి అనుగుణంగా పన్ను20రెట్లు పెరగబోతున్నాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత పన్ను విపరీతంగా పెంచే యోచన లో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో  నివసిస్తున్న పేదలకు ఆక్రమణ పేరుతో పన్ను లెక్కించి రెట్టింపు పెనాల్టీ వేయబోతున్నారన్నారు. ఖాళీ స్థలానికి పన్ను కట్టాల్సి వస్తుందని ప్రజలకు భారంగా ఉన్న పన్నులు పెంచే ఆలోచన విరమించుకోవాలన్నారు. టీడీ పీ నేతలు ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి,చంద్రశేఖర్‌రెడ్డి, దా నం, వెంకటరెడ్డి, రామ్మోహనరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising