ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం పూర్తి కాకపోతే సీమ ఎడారే: శ్రీనివాస్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-26T19:44:53+05:30

పోలవరం ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి రావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: పోలవరం ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి రావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు  శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. నిధుల కేటాయింపుల్లో కేంద్రం వెనుకడుగు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. రాష్ట్రానికి నిధులను రాబట్టేందుకు ఎంపీలు  ఎందుకు  నోరుమెదపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.


పోలవరం పూర్తి కాకపోతే సీమ ప్రాంతం ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. మెడలు వంచి రాష్ట్రానికి హోదా తెస్తామని చెప్పి డిల్లీలో పెద్దల వద్ద సీఎం జగన్మోహన్ మెడలు వంచుతున్నారని దుయ్యబట్టారు. పోలవరం నిధులు రాబట్టలేకపోతే సీమ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూక్జాలకు పాల్పడుతూ, కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గీతం, నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గు చేటని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-10-26T19:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising