ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతగాని ప్రభుత్వంతో రైతులకు నష్టం

ABN, First Publish Date - 2020-11-29T05:08:52+05:30

చేతగాని ప్రభుత్వం తన చేతగానితనంతో, నిర్లక్ష్యంతో రైతులను నిండా ముంచేస్తోందని టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

టీడీపీ రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): చేతగాని ప్రభుత్వం తన చేతగానితనంతో, నిర్లక్ష్యంతో  రైతులను నిండా ముంచేస్తోందని టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నివర్‌ తుఫాను వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. ఈ ఖరీఫ్‌లోనే వరుసగా నాలుగు విపత్తులతో 20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి రైతులు తల్లడిల్లిపోతున్నారన్నారు. నివర్‌ తుఫాను గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి తగిన జాగ్రత్తలు చేసి ఉంటే నష్టం జరిగేది కాదన్నారు. గత ఏడాది విపత్తు వల్ల జరిగిన నష్టాలకు ఇంతవరకూ పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. నివర్‌ తుఫాను వల్ల 10 జిల్లాలు, 300 మండలాల్లో 5 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారన్నారు.  ఒక్క కడప జిల్లాలోనే 73 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారన్నారు. రిజర్వాయర్లలో ఎప్పుడెంత స్టోరేజీ ఉండాలో, ఇన్‌ఫ్లో ఉండాలో అన్నదానిపై అవగాహన లేకపోవడంతో ప్రజల ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారన్నారు. నీట మునిగిన పట్టణాలు, గ్రామాల ప్రజలకు సరైన పునరావాస శిబిరాలు, భోజన సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే బుగ్గవంక డ్యాం గేట్లు ఎత్తే సమయంలో ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ముంపునకు గురి చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందించేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-29T05:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising