ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లను పరిశీలించిన సబ్‌కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-10-25T11:20:53+05:30

సిద్దవటం మండలలో ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను, ఇళ్లను అంచనా వేసి నివేదికను సమర్పించాలని రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, అక్టోబరు24 : సిద్దవటం మండలలో ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను, ఇళ్లను అంచనా వేసి నివేదికను సమర్పించాలని రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని వంతాటిపల్లె, పొన్నవోలు గ్రామాలను సందర్శించారు. అలాగే దెబ్బతిన్న పొలాలు, ఇళ్లను పరిశీలించారు.   కొంత మంది గ్రామస్థులు ఆ గ్రామానికి స్మశాన వాటిక కావాలని స్మశాన వాటిక లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు ఆయనను కోరారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్‌ ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.   అలాగే వ్యవసాయ శాఖ అధికారి పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం తహసీల్దారు రవికుమారి, వీఆర్వో ధనలక్ష్మి, ఆర్‌ఐ రిజ్వానా, కార్యదర్శి సంధ్య, వ్యవసాయాధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T11:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising