ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌ : ఎస్పీ

ABN, First Publish Date - 2020-06-03T10:09:10+05:30

జిల్లాలోని ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్‌ చేసి అసాంఘిక శక్తులు, ఫ్యాక్షనిస్టులకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (క్రైం), జూన్‌ 2 : జిల్లాలోని ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్‌ చేసి అసాంఘిక శక్తులు, ఫ్యాక్షనిస్టులకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు. కడప సబ్‌ డివిజన్‌ పరిధిలో మాలేపాడు, పులివెందుల పరిధిలో గుణకనపల్లె, ప్రొద్దుటూరు పరిధిలో చిన్నవరదాయపల్లె, జమ్మలమడుగు పరిధిలో బి.కోడూరు, మైదుకూరు పరిధిలో నేలటూరు, రాజంపేట పరిధిలో వై.కోట గ్రామాల్లో సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు స్పెషల్‌ పార్టీ బలగాలతో సోదాలు నిర్వహించారు. వైకోటలో నాటుసారా ఊట  ధ్వంసం చేసి ఒకరిని అరెస్టు చేశామన్నారు. నేలటూరులో 18 బాటిళ్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒకరిని అరెస్టు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై షీట్‌ ఓపెన్‌ చేస్తామని అన్నారు. 

Updated Date - 2020-06-03T10:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising