ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులు నమోదైనా జాగ్రత్తపడరా ?

ABN, First Publish Date - 2020-04-05T09:11:57+05:30

పట్టణంలో పాజి టివ్‌ కేసులు నమోదైనా జాగ్రత్త పడరా అని అధికారులు ప్రజలపై ఆగ్రహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిపించని భౌతిక దూరం, రోడ్లన్నీ కిటకిట 

పాజిటివ్‌ ప్రాంతాల్లో శానిటైజేషన్‌


పులివెందుల టౌన్‌, ఏప్రిల్‌ 4: పట్టణంలో పాజి టివ్‌ కేసులు నమోదైనా జాగ్రత్త పడరా అని అధికారులు ప్రజలపై ఆగ్రహిస్తున్నారు. పోలీసు లు కాస్తంత అవకాశం కలిగిస్తే వెంటనే రోడ్లన్నీ కిటకిటలాడతున్నాయి. భౌతిక దూరం పాటించ కపోవడాన్ని తప్పుపడుతున్నారు. వైరస్‌వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇళ్లలో ఉండటమే మార్గమని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నా పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. పులివెందులలో వైరస్‌ వ్యాప్తి జరిగి రెడ్‌జోన్‌ ప్రకటించి నా సడలింపు సమయంలో ఉదయం ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వస్తుండడంతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. శనివారం బైపాస్‌ రోడ్డు లో జనాలు, వాహనాలతో వీధులన్నీ రద్దీగా కనిపించాయి. ఇదిలాగే కొనసాగితే కరోనా కరాళ నృ త్యం చేస్తుందని భయాందోళన చెందుతున్నారు. 


పాజిటివ్‌ ప్రాంతాల్లో శానిటైజేషన్‌

పులివెందులలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. శుక్రవారం రాత్రి ము న్సిపల్‌ సిబ్బంది ట్యాంకర్లతో సోడియం హైడ్రో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మున్సిపల్‌ కార్మికులు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో హైడ్రోక్లోరైడ్‌, బ్లీచింగ్‌ పిచికారీ చేశారు. 


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

పులివెందుల: పులివెందులలో లాక్‌ డౌన్‌ పోలీసులు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 9గంటల వరకు ప్రజలు నిత్యావసర సరుకులు, మందుల కోసం బయట కనిపించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన కుటుంబాల్లో అన్ని రోడ్లకు బారికేడ్లను వేసి రాకపోకల ను నియంత్రించారు. పులివెందుల, వేంపల్లె మండలాల్లో కరోనా నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదుతో ప్రజలంతా ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. వేంపల్లెలో  ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. 

Updated Date - 2020-04-05T09:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising