ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరి

ABN, First Publish Date - 2020-12-02T04:57:54+05:30

ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి అన్నారు.

అక్రమ కట్టడాలను కూల్చుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, డిసెంబరు 1: ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని రాజారెడ్డి కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీలలో అక్రమకట్టడాలను మంగళవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆయా కాలనీలలో మురుగునీటి పైప్‌లైనుపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని,  వాటిని జేసీబీ ద్వారా తొలగించామన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పెద్దరంగాపురంలో పర్యటించారు. అక్కడి మౌలిక వసతులపై ఆరాతీశారు. వీధిలైట్లు, సిమెంటు రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నీటిసమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising