ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు ఖర్చుకు రూ.13,500 కోట్లు

ABN, First Publish Date - 2020-06-28T07:17:49+05:30

వైఎ్‌సఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి యేటా వ్యవసాయ సాగు ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 కోట్లు రైతులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ  సీఎం  అంజద్‌బాషా


కడప (నాగరాజుపేట), జూన్‌ 27 : వైఎ్‌సఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి యేటా వ్యవసాయ సాగు ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 కోట్లు రైతులకు అందిస్తుందని డిప్యూటీ సీఎం, మండల వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ అంజద్‌బాషా తెలిపారు. వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయంలో శనివారం సలహా మండలి సమావేశం జరిగింది.


ఈ సందర్బంగా అంజద్‌బాషా మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు జిల్లా, మండల వ్యవసాయ మండళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1700 హెక్టార్లలో పంట సాగులో ఉందన్నారు. గత ప్రభుత్వం చెల్లించలేని బీమా ఈ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గ్రామ స్థాయిలోనే పంటకు గిట్టుబాటు ధర, కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు.


కౌలుదారులకే లబ్ధి చేకూర్చే విధంగా సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుత సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలని సలహా మండలి గ్రామ స్థాయిలో వివరించడం జరిగిందని ఏరువాక శాస్త్రవేత్త వీరయ్య తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ మురళీక్రిష్ణ, ఏడీ నరసింహారెడ్డి, తహసీల్దారు శివరామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-28T07:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising