ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకడ్బందీగా ఆర్‌జీయూకేటీ సెట్‌ 2020

ABN, First Publish Date - 2020-11-27T06:45:44+05:30

రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలలో ప్రవేశానికి 28వ తేది శనివారం రాజీవ్‌గాంధి యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ సెట్‌-2020 పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆర్‌జేడీ ఎంవీ క్రిష్ణారెడ్డి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతి లేదు :  ఆర్‌జేడీ క్రిష్ణారెడ్డి

కడప(ఎడ్యుకేషన్‌), నవంబరు 26: రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలలో ప్రవేశానికి 28వ తేది శనివారం రాజీవ్‌గాంధి యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ సెట్‌-2020 పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆర్‌జేడీ ఎంవీ క్రిష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లాలో పరీక్షలకు 67 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9440 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని చెప్పారు. కడప డీఈవో కార్యాలయంలో గురువారం డీఈవో శైలజ అధ్యక్షతన చీఫ్‌ డిపార్ట్‌మెంటు అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఆర్‌జీయూకేటీ సెట్‌ 2020 పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులను రెండుగంటల ముందు పరీక్ష కేంద్రాలకు అనుమతించాలన్నారు. కోవిడ్‌ నిబంఽధనలు తప్పక పాటించాలని సూచించారు. హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా కనబడకపోతే సంబంధిత పాఠశాల హెచ్‌ఎం, లేదా గెజిటెడ్‌ ఆఫీసర్‌తో కొత్త ఫొటో అతికించి అటెస్టేషన్‌ చేయించాలన్నారు. పరీక్ష కేంద్రానికి మొబైల్‌ ఫోన్లు, చేతివాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించరాదని సూచించారు. ఉప విద్యాధికారులు రంగస్వామి, వరలక్ష్మి, రంగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T06:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising