అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలి
ABN, First Publish Date - 2020-11-14T05:20:26+05:30
రాష్ట్ర ప్రభుత్వం తక్షణ మే అమలు చేయాలని బీజేపీ యువమోర్చానేతలు ప్రదీప్‌రెడ్డి, నరేష్, రాఘవేంద్రరెడ్డిలు డిమాండ్ చేశా రు.
ప్రొద్దుటూరు అర్బన్, నవంబర్ 13: ఆర్థికంగా వెనుక బడిన అగ్రవర్ణ పేద విద్యార్థులకు కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణ మే అమలు చేయాలని బీజేపీ యువమోర్చానేతలు ప్రదీప్‌రెడ్డి, నరేష్, రాఘవేంద్రరెడ్డిలు డిమాండ్ చేశా రు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని పలు కళాశాలల్లో విద్యార్థులతో సంతకా ల సేకరణ ఉద్యమం చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రిజర్వేషన్లు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఇప్పటికైన ఆయన స్పందించా లని లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్ర మంలో రవితేజ, మధు, చైతన్య పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T05:20:26+05:30 IST